Haryana Election Results 2019: హర్యానాలో బీజేపీకి షాక్... చిన్నపార్టీకి సీఎం సీటు ఆఫర్ చేసిన కాంగ్రెస్

Haryana Election Results 2019: హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఈసారి ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాల్లోను బీజేపీ పోటీ చేసింది. కానీ కేవలం 38 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది.

news18-telugu
Updated: October 24, 2019, 10:27 AM IST
Haryana Election Results 2019: హర్యానాలో బీజేపీకి షాక్... చిన్నపార్టీకి సీఎం సీటు ఆఫర్ చేసిన కాంగ్రెస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హర్యానా ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీకి షాక్ తప్పేలా లేదు.  ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా...  మరో చిన్న పార్టీ కమలంలో కలవరం రేపుతోంది. హర్యానాలో జన నాయక్ జనతా పార్టీ ( జేజేపీ ) పదిగంటల సమయానికి దాదాపుగా 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

హర్యానాలో బిజెపికి 31 ఏళ్ల యువకుడు షాక్ ఇవ్వబోతున్నాడా...అంటూ రాజకీశ విశ్లేషకులు అప్పుడే చర్చలు మొదలుపెట్టారు. హర్యానాలో జేజేపీ అధినేత దుష్యంత్ కింగ్ మేకర్ కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  పది స్థానాల్లో jjp లీడింగ్‌లో కొనసాగుతుండటంతో ఈ కొత్త చర్చలన్నీ తెరపైకి వస్తున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఈసారి ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాల్లోను బీజేపీ పోటీ చేసింది. కానీ కేవలం 38 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. దీంతో కౌంటింగ్ దృష్ట్యా ఇప్పుడు బీజేపీ నేతలు జేజేపీ, ఇండిపెండెంట్లతో మంతనాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. జేజేపీ చీఫ్ దుష్యంత్‌కు సీఎం సీటు ఆఫర్ చేసింది. తమతో కలిసి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఎం పదవి ఇస్తామని తెలిపింది. దీంతో మరోసారి కర్నాటక రాజకీయాలు హర్యానాలో కనిపిస్తున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: October 24, 2019, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading