news18-telugu
Updated: September 14, 2020, 6:10 PM IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వరుసగా రెండోసారి హరివంశ్ ఎన్నికయ్యారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. మూజువాణి పద్దతిలో సభలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం ఫలితాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. హరివంశ్ నారాయణ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయినట్లు ప్రకటించారు. ఆయన చేతిలో యూపీఏ అభ్యర్థి మనోజో ఝా ఓటమి పాలయ్యారు. వరుసగా రెండోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైందుకు..హరివంశ్ నారాయణకు రాజ్యసభ సభ్యులు అభినందనలు తెలిపారు. ఎంతో నిజాయితీ కలిగిన హరివంశ్ అంటే తనకు ఎంతో గౌరవమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన పారదర్శకత ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వహణను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఆయన్ను కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ కూడా అభినందించారు.
జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్ నారాయణ్ గతంలోనూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో మరోసారి పోటీలో నిలిచారు గెలుపొందారు.
Published by:
Shiva Kumar Addula
First published:
September 14, 2020, 5:59 PM IST