Home /News /politics /

HARISHRAO DISCUSSED ABOUT LOK SABHA RESULTS WITH TRS CHIEF KCR ALONG WITH KAVITHA NK

మళ్లీ తెరపైకి హరీష్‌ రావు... కేసీఆర్‌తో చర్చ... టీఆర్ఎస్‌లో మార్పు మొదలైందా...

హరీష్ రావు (File)

హరీష్ రావు (File)

Harish Rao : రాజకీయాల్లో కొందరు వ్యక్తులు శక్తులవుతారు. అలాంటి వాళ్లను దూరం పెడితే పార్టీకే ప్రమాదం. హరీష్ రావు విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఇలాగే ఆలోచిస్తోందా ?

తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం హరీష్ రావు అని టీఆర్ఎస్ నేతలే కాదు... ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే... టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత... క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్‌మెంట్‌పై వంద శాతం పట్టు ఉన్నది హరీష్ రావుకే. అందుకే ఆయన్ని ట్రబుల్ షూటర్ అంటుంటారు. తాజాగా ఆ సిద్ధిపేట ఎమ్మెల్యే... పార్టీ అధినేత కేసీఆర్‌ని కలిశారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరిగింది. ఈ మీటింగ్‌ని కేసీఆర్ ఎంత కీలకంగా భావించారంటే... ఇదే భేటీలో వీళ్లిద్దరితోపాటూ... లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ ఎంపీ కవిత కూడా ఉన్నారు. హరీష్ రావుకి కేసీఆర్ ఏదీ దాచకుండా అన్నీ చెప్పారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం ఒక కీలక అంశమైతే... కారు, సారు, పదహారు, చివరకు కంగారు తెప్పించడం మరో కీలక అంశంగా చర్చకు వచ్చాయి. ఏం జరిగింది, ఎక్కడ తేడా వచ్చింది, నాలుగు నెలల కిందట బ్రహ్మరథం పట్టిన ప్రజలు... ఇప్పుడెందుకు తిరస్కరించారు? ఇంతలోనే అంత మార్పు ఎందుకొచ్చింది. అన్న అంశాలపై హరీష్ రావు అభిప్రాయాల్ని కేసీఆర్ తెలుసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీజేపీకి 4, కాంగ్రెస్‌కి 3 ఎంపీ సీట్లు రావడంపై కేసీఆర్ టెన్షన్ పడగా... హరీష్ రావు ధైర్యం చెప్పారని తెలిసింది.

అసలు విషయం అదేనా? : డిసెంబర్ 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్, హరీష్ రావును దూరం పెడుతున్నారనీ, అందులో భాగంగానే కేటీఆర్‌ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారన్న వాదన తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో ఇదివరకు మంత్రిగా ఉన్న హరీష్ రావుకి ఈసారి అవకాశం ఇవ్వకపోవడంపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఓ మంచి నేతను కేసీఆర్ కావాలనే పక్కన పెడుతున్నారనీ, హరీష్ రావు ఎదుగుదలను కేసీఆర్ సహించలేక, ఎలాగైనా తొక్కేయాలన్న కుట్రతోనే ఆయన్ని దూరం పెడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.

సోషల్ మీడియాలో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. హరీష్ రావు పార్టీ వీడతారనీ, కాంగ్రెస్‌లో చేరతారనీ, కొత్త పార్టీ పెడతారనీ... ఇలా చాలా కామెంట్లు వచ్చాయి. అఫ్‌కోర్స్ ఎప్పటికప్పుడు వాటిని హరీష్ రావు ఖండిస్తూనే వచ్చారు. తద్వారా ఆయనకూ పార్టీకీ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని స్పష్టం చేశారు. 4 నెలల తర్వాత జరిగిన తాజా భేటీతో అది మరోసారి రుజువైంది కూడా.

హరీష్ రావు లేని లోటు కనిపించిందిగా : పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... తెరవెనక ఏదో జరుగుతోందన్న డౌట్ మనకు వస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు మొత్తం తానే చూసుకున్నారు. చివరకు కేసీఆర్ గెలుపు బాధ్యతను కూడా తన నెత్తికెత్తుకున్నారు. ఫలితం అదిరిపోయింది. అసలు టీఆర్ఎస్ అధినాయకత్వమే ఆ రేంజ్‌లో గెలుస్తామని అనుకోలేదు. సరిగ్గా 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు మెదక్ దాటి బయటకు రాలేదు. దాంతో కారు,సారు,పదహారు నినాదం బెడిసికొట్టింది. అదే హరీష్ రావు ఎంట్రీ ఇచ్చివుంటే, ఫలితం మరోలా ఉండేదంటున్నాయి పార్టీ వర్గాలు. సో, ఆలస్యంగానైనా హైకమాండ్ హరీష్ రావు ప్రాధాన్యాన్ని గుర్తిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.ఇవి కూడా చదవండి :

ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్... 16కి చేరిన మృతుల సంఖ్య... ఇద్దరు భారతీయులు కూడా...

చంద్రబాబు మైండ్ బ్లాంక్... ఫలితాలపై తీవ్ర ఆవేదన... డ్రామాలు చాలన్న వైసీపీ...
Published by:Krishna Kumar N
First published:

Tags: CM KCR, Harish Rao, Kcr, Telangana Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు