డిసెంబర్ 9... జ్ఞాపకాల్లోకి వెళ్లిన హరీశ్ రావు

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడిన డిసెంబర్ 9ను గుర్తు చేసుకున్నారు మంత్రి హరీశ్ రావు.

news18-telugu
Updated: December 9, 2019, 3:06 PM IST
డిసెంబర్ 9... జ్ఞాపకాల్లోకి వెళ్లిన హరీశ్ రావు
హరీశ్ రావు (ఫైల్)
  • Share this:
డిసెంబర్ 9. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. అసాధ్యమనుకున్న తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమే అన్నట్టుగా కేంద్రం తొలిసారి ప్రకటన చేసిన రోజు. నాటి టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష విరమించిన రోజు. ఈ చారిత్రాత్మకమైన రోజును తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు అని... ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో ఉధ్యమం విజయతీరాలకు చేరిన రోజు అని హరీశ్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమరణ దీక్షకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు.


2009‌లో తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్... కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేయగానే దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తెలంగాణపై ప్రకటన చేసిన ఇదే రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు కావడం మరో విశేషం.


First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>