హరీశ్‌ రావును కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవాలి... మాజీమంత్రి వ్యాఖ్య

సీఎం కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే హరీశ్ రావును దూరం పెట్టారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు.

news18-telugu
Updated: June 20, 2019, 6:18 PM IST
హరీశ్‌ రావును కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవాలి... మాజీమంత్రి వ్యాఖ్య
హరీశ్ రావు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 20, 2019, 6:18 PM IST
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీమంత్రి హరీశ్ రావును కూడా పిలవాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కోసం తామే కష్టపడ్డట్లు తండ్రీకొడుకులు గొప్పగా చెప్పుకోవడం సరికాదని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను విడగొట్టి ఎందుకు నిర్వహించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిని, పార్టీని సంతృప్తి పరచడానికి వేరుగా ఎన్నికలు నిర్వహించారని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్‌లకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల్లో అవినీతికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్, ఫడ్నవీస్ వచ్చినా మాకు ఇబ్బంది లేదని చిన్నారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే హరీశ్ రావును దూరం పెట్టారని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌లో నియంతృత్వం రోజురోజుకూ పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినా కేసీఆర్‌ వైఖరిలో మాత్రం మార్పులేదన్నారు. హరీష్‌రావుకు పేరొస్తుందనే కాళేశ్వరం సాధకుడినని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్‌ విగ్రహం పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.


First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...