హరీశ్ రావు మనసులో ఏముంది? మళ్లీ చక్రం తిప్పబోతున్నారా?

గతంలో హరీశ్ రావు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అయినా అప్పుడు అంతగా పేరు రాలేదు.

news18-telugu
Updated: April 25, 2019, 7:48 PM IST
హరీశ్ రావు మనసులో ఏముంది? మళ్లీ చక్రం తిప్పబోతున్నారా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
news18-telugu
Updated: April 25, 2019, 7:48 PM IST
తెలంగాణ ఎమ్మెల్యే హరీశ్ రావు మళ్లీ చక్రం తిప్పబోతున్నారా? ఆయనకు గత వైభవం రానుందా? గత కొన్ని రోజులుగా ఆయన తీరును చూస్తే మళ్లీ ఆయన యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. రోజువారీ సమీక్షలతో పాటు ఇతర రాజకీయపరమైన కార్యక్రమాల్లోకూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో హరీశ్ రావు మళ్లీ చక్రం తిప్పబోతున్నారనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం అయిన సందర్భంగా ఇంజినీర్లు, ఇతర అధికారులను అభినందించిన హరీశ్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి 2018 డిసెంబర్ వరకు ఆ బాధ్యతలు మొత్తం చూశారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారింది. కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం, కేబినెట్‌లోకి కూడా హరీశ్ రావును తీసుకోకపోవడంతో హరీశ్ రావు కథ రాజకీయంగా ముగిసిపోయినట్టే అనే ప్రచారం జరిగింది.

గత కొన్నిరోజులుగా హరీశ్ రావు క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. గతంలో కూడా ఆయన యాక్టివ్‌గా ఉన్నా.. హరీశ్ రావుకు ఎక్కడా పేరు రాలేదు. సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంలో కూడా ఆయన పేరు పెద్దగా వినిపించలేదు. అయితే, ఈ మధ్యకాలంలో హరీశ్ రావు పేరు కూడా వార్తల్లో కనిపిస్తోంది. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని హితబోధ చేశారు.వీటితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో శ్రమించిన ఇంజినీర్లను అభినందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 6 లోని మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయిన సందర్బంగా కష్టపడ్డ ఇంజినీర్లకు అభినందనలు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు ’ అని ట్వీట్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే తన నియోజకవర్గ పరిధిలోని అంశాల వరకే పరిమితమైన హరీశ్ రావు తొలిసారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం రాజకీయవర్గాల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది.


హరీశ్ రావును పక్కన పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇతర పార్టీల్లోని నాయకులు కూడా హరీశ్ రావుకు సానుభూతి తెలిపారు.
First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...