Home /News /politics /

Harish Rao: కేసీఆర్ ఆలోచన.. హరీశ్ రావుకు ఆ కొత్త శాఖ ఖాయం.. కానీ అదొక్కటే డౌట్..

Harish Rao: కేసీఆర్ ఆలోచన.. హరీశ్ రావుకు ఆ కొత్త శాఖ ఖాయం.. కానీ అదొక్కటే డౌట్..

గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు

గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు

Harish Rao: ఏ శాఖను అప్పగించినా.. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరున్న హరీశ్ రావు.. వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకుంటే.. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలతో పాటు ఆరోగ్య రంగం మరింత మెరుగుపడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

    ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. కరోనా కష్టకాలంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిపై ఇతర కారణాలతో వేటు వేసిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతానికి ఆ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించారు. అయితే కొద్దిరోజులుగా వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన సమీక్షల్లో సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావును ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన సమీక్షలోనూ మంత్రి హరీశ్ రావు పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

    ఈ పరిణామాలను బట్టి.. త్వరలోనే మంత్రి హరీశ్ రావుకు వైద్య,ఆరోగ్యశాఖ ఇవ్వడం దాదాపు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండటంతో.. హరీశ్ రావు ముందుగా వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షల్లో పాల్గొన్న తరువాత ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో సీఎg కేసీఆర్ ఉన్నారనే టాక్ కూడా ఉంది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్.. అనంతరం శాఖలకు సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఒకవేళ హరీశ్ రావుకు కీలకమైన వైద్య,ఆరోగ్యశాఖ అప్పగిస్తే.. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మరొకరికి అప్పగిస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది.

    వైద్య, ఆరోగ్యశాఖ ఎంతో కీలకం కావడం... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ శాఖతో పాటు మరో శాఖ బాధ్యతలు నిర్వహించడం కష్టమనే అభిప్రాయం కూడా ఉంది. ఈ కారణంగానే హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించి ఆర్థికశాఖను మరొకరికి అప్పగించడమో లేక ఆ శాఖను తన దగ్గరే పెట్టుకోవడమే సీఎం కేసీఆర్ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏ శాఖను అప్పగించినా.. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరున్న హరీశ్ రావు.. వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకుంటే.. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలతో పాటు ఆరోగ్య రంగం మరింత మెరుగుపడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు