కేసీఆర్ కంటే హరీష్ రావే గొప్ప..బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పసుపుపై రైతులు ఆందోళన చెందొద్దన అరవింద్.. బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు అరవింద్.

news18-telugu
Updated: September 1, 2019, 5:33 PM IST
కేసీఆర్ కంటే హరీష్ రావే గొప్ప..బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌తో హరీశ్‌రావు (file)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పిస్తారని ప్రచారం జరగడం, తనకు మంత్రి పదవి బిక్ష కాదని ఈటల సంచలన వ్యాఖ్యలు చేయడం, గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఉద్వేగంగా మాట్లాడడం, ఆ వెంటనే కేసీఆర్‌ని పొగడడం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే ఈటెల రాజేంద్ర ప్రసాద్, ఈటెల రాజేందరే ఎక్కువ కష్టపడ్డారని అభిప్రాయపడ్డారు.


టీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంది. ఉద్యమ సమయంలో అహర్నిశలు పనిచేసిన వారే టీఆర్ఎస్‌కు దూరమయ్యారు. లక్ష ఓట్లతో ఘోరగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తారా? కేసీఆరే గులాబీ జెండాకు యజమాని అని ఎర్రబెల్లి చెప్పడం ఎంత వరకు కరెక్ట్..? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌లే ఎక్కవ కష్టపడ్డారు.
ధర్మపురి అరవింద్, బీజేపీ ఎంపీ


ఎంపీ అరవింద్

రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అరవింద్ అన్నారు. దేశమంతటా ఎరువుల సరఫరా ఉందని, కానీ తెలంగాణ వ్యవసాయ మంత్రికి సోయి లేదని ధ్వజమెత్తారు. పసుపుపై రైతులు ఆందోళన చెందొద్దన అరవింద్.. బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు అరవింద్.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading