Home /News /politics /

HARISH RAO DOUBLE HATRICK VICTORY IN SIDDIPET MEJORITY CROSSED ONE LAKH

రికార్డులు బద్దలు కొట్టిన హరీశ్: డబుల్ హ్యాట్రిక్ విజయం, 1,20,655 ఓట్ల మెజార్టీ

హరీశ్ రావు

హరీశ్ రావు

Telangana assembly elections 2018|. సిద్ధిపేటను అభివ‌ృద్ధికి చిరునామాకు నిలిపి, తెలంగాణ ఉద్యమంలో అగ్రపథాన నిలిచిన హరీశ్‌రావు.. విజయపథంలోనూ, మెజార్టీ సాధనలోనూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అతి పిన్న వయసులో ఆరుసార్లు సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించి.. ఊరిస్తూ వస్తున్న లక్ష మార్క్ మెజారిటీనీ అందుకున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో హరీశ్ అంటే ఓ ప్రభంజనం. ఆయన బరిలో నిలిచేది మెజార్టీని మరింత పెంచుకోవడానికే తప్ప.. గెలుపు, ఓటముల ప్రస్తావనే ఉండదనే అభిప్రాయం స్థానికంగా ఉంటుంది. రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న హరీశ్‌రావు మెజార్టీ.. ఈ ఎన్నికల్లో లక్ష మార్కు దాటింది. సుమారు లక్షా ఇరవై వేల భారీ మెజార్టీతో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశారాయన. అంతేకాదు, అతిచిన్న వయస్సులో డబుల్ హ్యాట్రిక్ సాధించిన లీడర్‌గా చరిత్ర సృష్టించారు హరీశ్‌రావు.
    2004లో జరిగిన ఉప ఎన్నికతో సిద్దిపేట బరిలో నిలిచిన హరీశ్.. 24,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత అంతకంతకూ ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తోంది. 2008 ఉప ఎన్నికల్లో 58,000, 2009 ఎన్నికల్లో 64,667, 2010 ఉప ఎన్నికల్లో 93,858, 2014 ఎన్నికల్లో 95,328 మెజార్టీ సాధించిన హరీశ్‌రావు లక్ష మార్కును మాత్రం దాటలేకపోయారు. ఆ కోరిక ఈ ఎన్నికలతో తీరిపోయింది. తాజా ఎన్నికల్లో హరీశ్ దాదాపు 1,20,000 అఖండ మెజార్టీతో గెలుపొంది సరికొత్త రికార్డు స‌ృష్టించారు.

    తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హరీశ్‌రావు టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులో భాగంగా.. 2004లో టీఆర్ఎస్ అధినేత సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే రెండింటిలోనూ గెలిచిన కేసీఆర్.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంలో భాగమయ్యారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ.. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో.. ఎమ్మెల్యే కాకుండానే 32ఏళ్ల వయసులో హరీశ్ రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన సిద్దిపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అది మొదలు, తన విజయపరంపరను కొనసాగిస్తున్న హరీశ్... అతి చిన్నవయసులోనే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన లీడర్‌గా చరిత్ర సృష్టించారు. 1,20,000 మెజార్టీ సాధించి మరో రికార్డును తన పేరున లిఖించుకున్నారు.
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: CM KCR, Harish Rao, Telangana, Telangana Election 2018, Telangana News, YSR

    తదుపరి వార్తలు