కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేందర్ నగర్ లో జన ఆక్రోష్ పేరిట ఏర్పాటు చేసిన ప్రచార సభలో హార్దిక్ పటేల్ ప్రసంగిస్తుండగా, వేదికపై దూసుకువచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అతని చెంప ఛెళ్లు మనిపించాడు. దీంతో ఒక్క సారిగా సభా స్థలిలో గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం హార్దిక్ పటేల్ పై దాడి చేసిన వ్యక్తిని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుడిని చితకబాదారు. అయితే నిందితుడు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే హార్దిక్ పటేల్ పాటిదార్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా నేతలపై భౌతిక దాడులు జరగడం పరిపాటిగా మారింది. మొన్న ఏపీ ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడులు చేయగా, తాజాగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి జరిగింది. దీంతో నేతలకు అదనపు భధ్రత కల్పించాలనే డిమాండ్ వెలుగులోకి వస్తోంది.
#WATCH Congress leader Hardik Patel slapped during a rally in Surendranagar,Gujarat pic.twitter.com/VqhJVJ7Xc4
— ANI (@ANI) April 19, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Gujarat Lok Sabha Elections 2019, Hardik Patel