టైలర్ కొడుకు.. నా కొడుకు ఒకేసారి ఐఐటీలో.. : సీఎం కేజ్రీవాల్

సీఎం అయ్యాక ఢిల్లీలో ప్రభుత్వ విద్యారంగంపై ఆయన ఫోకస్ పెట్టారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు,నాణ్యమైన విద్యపై పలువురు విద్యావేత్తలు సైతం ప్రశంసలు కురిపించారు.

news18-telugu
Updated: August 28, 2019, 8:53 AM IST
టైలర్ కొడుకు.. నా కొడుకు ఒకేసారి ఐఐటీలో.. : సీఎం కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్(File Photo)
  • Share this:
మన దేశంలో ఓ సీఎం కొడుకు.. ఓ సామాన్య మధ్యతరగతి ఉద్యోగి కొడుకు.. ఇద్దరూ ఒకే స్కూల్లో చదవడం ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో దాదాపు జరగని పని. ప్రపంచంలో చాలా దేశాలు నాణ్యమైన ఉచిత విద్యను,వైద్యాన్ని అందిస్తోంటే.. భారత్ మాత్రం ఆ విషయంలో చాలా వెనుకంజలో ఉంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహించడంతో.. ప్రభుత్వ విద్య నిర్వీర్యమైపోయి.. కేవలం పేదలు,కొంతమంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే అందులో చదువుతున్నారు. అయితే ఈ అసమ స్థితిని తాము సరిదిద్దుతున్నామని చెబుతున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తమ ప్రభుత్వం అందించిన ఉచిత నాణ్యమైన విద్యతో ఓ టైలర్ కొడుకు ఐఐటీలో సీటు సంపాదించాడని కేజ్రీవాల్ వెల్లడించారు. తన కొడుకు, ఆ టైలర్ కొడుకు కలిసి ఒకే ఐఐటీలో చదువుకుంటారని.. ఇందుకు తాను చాలా సంతోషపడుతున్నానని అన్నారు.

విజయ్ కుమార్ తండ్రి ఒక టైలర్, తల్లి గ‌ృహిణి. ఢిల్లీ ప్రభుత్వం అందించిన ఉచిత కోచింగ్ ద్వారా విజయ్ ఐఐటీలో సీటు సంపాదించాడు. డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ విజన్‌ను ఢిల్లీ ప్రభుత్వం సాకారం చేసింది. నా కొడుకు, ఆ టైలర్ కొడుకు ఒకే సమయంలో ఐఐటీలో చేరుతుండటం నాకు సంతోషం అనిపిస్తోంది. ఇంతకుముందు ఓ పేదవాడి కొడుకు పేదవాడి గానే మిగిలిపోయే పరిస్థితి ఉండేది. కారణం..సరైన విద్య అందకపోవడమే. కానీ నాణ్యమైన విద్య,శిక్షణ అందించడం ద్వారా పేద-ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.
అరవింద్ కేజ్రీవాల్,ఢిల్లీ సీఎం


కాగా, కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ ఇటీవలే సీబీఎస్‌ఈ నుంచి 96.4శాతం ఉత్తీర్ణుడయ్యాడు. 2014లో కేజ్రీవాల్ కుమార్తె కూడా 96శాతంతో సీబీఎస్‌ఈలో ఉత్తీర్ణురాలైంది. అనంతరం ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE)లో అర్హత సాధించింది. సీఎం కేజ్రీవాల్ కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక ఢిల్లీలో ప్రభుత్వ విద్యారంగంపై ఆయన ఫోకస్ పెట్టారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు,నాణ్యమైన విద్యపై పలువురు విద్యావేత్తలు సైతం ప్రశంసలు కురిపించారు.
First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading