టీడీపీకి మరో షాక్...మాజీ మంత్రి భవనానికి జీవీఎంసీ నోటీసులు

కుమార్తె సాయి పూజిత పేరుతో నిర్మించిన ఈ భవనం నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే కూల్చేస్తామని జీవీఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: August 23, 2019, 8:13 AM IST
టీడీపీకి మరో షాక్...మాజీ మంత్రి భవనానికి జీవీఎంసీ నోటీసులు
జీవీఎంసీ కార్యాలయం (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 23, 2019, 8:13 AM IST
తెలుగుదేశం పార్టీ నేతలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు షాక్ మీద్ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతల ఇళ్లకు, భవనాలకు నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో మాజీ మంత్రి భవనానికి కూడా కూల్చేస్తామని అధికారులు ఆదేశాలిచ్చారు. భీమిలీలోని టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆఫీసుకు జీవీఎంసీ నోటీసులు అందించింది. కుమార్తె సాయి పూజిత పేరుతో నిర్మించిన ఈ భవనం నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే కూల్చేస్తామని జీవీఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...