24 గంటల్లో కూల్చేస్తాం.. గంటా గెస్ట్‌హౌస్‌కు నోటీసులు..

విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో కూల్చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు.

news18-telugu
Updated: August 22, 2019, 10:21 PM IST
24 గంటల్లో కూల్చేస్తాం.. గంటా గెస్ట్‌హౌస్‌కు నోటీసులు..
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో కూల్చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తామంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో తొలి అడుగు వేసి.. ఏకంగా ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతలకు నోటీసులు వస్తున్నాయి. విశాఖకు చెందిన టీడీపీ నేతలకు కూడా నోటీసులు వచ్చాయి. విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దీనిపై ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు గతవారం కూల్చి వేశారు.

గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ఆయన బీజేపీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉన్నారు. మరోవైపు అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading