చంద్రబాబు ముసుగులన్ని తొలగించి.. బండారం బయటపెడుతాం : జీవీఎల్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం గుంటూరు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జీవీఎల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ది పట్ల కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కనీసం మూడంటే మూడు పనులు కూడా ఏపీ కోసం చేయలేదని ఆరోపించారు.

news18-telugu
Updated: January 20, 2019, 9:40 PM IST
చంద్రబాబు ముసుగులన్ని తొలగించి.. బండారం బయటపెడుతాం : జీవీఎల్
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలకే చంద్రబాబు పసుపు ముసుగు వేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్‌ నరసింహారావు విమర్శించారు. చంద్రబాబు అన్ని ముసుగులను త్వరలోనే తొలగించి అసలు బండారం బయటపెడుతామని అన్నారు. అవినీతి, ఆర్భాటపు ప్రచారం తప్ప రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమి లేదని మండిపడ్డారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం గుంటూరు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జీవీఎల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ది పట్ల కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కనీసం మూడంటే మూడు పనులు కూడా ఏపీ కోసం చేయలేదని ఆరోపించారు.

గృహ నిర్మాణాల పేరిట టీడీపీ ప్రభుత్వం అంతు లేని అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడం కేంద్రం చూపించిన చొరవ వల్లేనని, అదేదో తన గొప్పే అన్నట్టుగా లోకేశ్ ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ చేస్తున్న ప్రకటనలను మరోసారి ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలనుకంటే ఆ పనిచేయవచ్చునని అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అవినీతికి తగిన మూల్యం చెల్లించక తప్పదని, జైలుకు వెళ్లడానికి వారు సిద్దంగా ఉండాలని జీవీఎల్ ఫైర్ అయ్యారు.
Published by: Srinivas Mittapalli
First published: January 20, 2019, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading