news18-telugu
Updated: June 22, 2019, 5:41 PM IST
బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ (ఫైల్ ఫోటో)
రాజ్యసభలో మెజార్టీ కోసం టీడీపీ సభ్యులను బీజేపీలో చేర్చుకున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరినంత మాత్రాన వారిపై ఉన్న అభియోగాలు తొలిగిపోవని అన్నారు. చట్టపరంగా వారిపై ఉన్న అభియోగాలపై విచారణ జరుగుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరిన వారంతా పార్టీ నిబంధనలకు లోబడే పని చేయాల్సి ఉంటుందని అన్నారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అల్లరి చేసిన పార్టీలకు తగిన శాస్తి జరిగిందని... అందులో టీడీపీ ముందు వరుసలో ఉందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్రమోదీ చేసిన సుపరిపాలన కారణంగానే ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కట్టారన్న జీవీఎల్ నరసింహారావు... వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే కొద్ది నెలల్లోనే రాజ్యసభలోనూ బీజేపీకి మెజార్టీ వస్తుందన్న జీవీఎల్... కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎటువంటి అడ్డంకి ఉండదని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
June 22, 2019, 5:41 PM IST