జగన్‌పై నోరు జారిన వైసీపీ నేత.. ఎంత మాటనేశారు..

గుంటూరు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏసురత్నం సీఎం జగన్‌పై నోరు జారారు.జగన్ పాలనను ప్రశంసిస్తూ ఏదో చెప్పబోయిన ఆయన..

news18-telugu
Updated: October 16, 2019, 3:27 PM IST
జగన్‌పై నోరు జారిన వైసీపీ  నేత.. ఎంత మాటనేశారు..
వైఎస్ జగన్,ఏసురత్నం
  • Share this:
అసలే ఇది సోషల్ మీడియా కాలం.. నేతలు ఏ చిన్న తప్పు మాట్లాడిన ఇంటర్నెట్‌లో ఇట్టే వైరల్ అయిపోతుంది.కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచీతూచీ ఆలోచించుకుని మాట్లాడాలి. అయితే ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా సరే..కొన్నిసార్లు తప్పులు దొర్లిపోవడం సహజం. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు కూడా ఇలా పొరపాటుపడ్డవారే. తాజాగా గుంటూరు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏసురత్నం కూడా నోరు జారారు.జగన్ పాలనను ప్రశంసిస్తూ ఏదో చెప్పబోయిన ఆయన.. 'స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి' అంటూ సంబోధించారు. ఇంతలో పక్కనున్నవారు తప్పును సరిదిద్దడంతో.. వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మళ్లీ తడబడ్డారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనబోయి.. అలవాటులో పొరపాటుగా 'స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి' అని సంబోధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ ఫుల్లుగా జోక్స్ పేలుస్తున్నారు.


First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading