అచ్చెన్నాయుడిపై కేసు.. టీడీపీ ఎమ్మెల్యేకి షాక్

పోలీసులతో అచ్చెన్నాయుడు వాగ్వాదం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. చలో ఆత్మకూరు సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కరకట్ట మీద ఉన్న ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్దకు చేరుకున్నారు. అయితే, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విధుల్లో ఉన్న పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బందోబస్తు విధుల నిర్వహణలో భాగంగా అమరావతి కరకట్టపై విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సదారి, కోటయ్య పట్ల అనుచిత ప్రవర్తన, దుర్భాషలాడారంటూ కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30, అమలులో ఉన్నప్పటికీ చట్టం ఉల్లంఘన, విధుల నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు.

    First published: