HOME »NEWS »POLITICS »guntur people protest before ap ministers botsa mopidevi sb

ఏపీ మంత్రులకు చేదు అనుభవం... అడ్డుకున్న జనం

ఏపీ మంత్రులకు చేదు అనుభవం... అడ్డుకున్న జనం
మంత్రులు బొత్స, మోపిదేవి వెంకటరమణ

మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 • Share this:
  గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ పర్యటించారు. పారిశుద్ధ్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మౌళిక వసుతులపై అధికారులుతో సమీక్ష నిర్వహించారు. వాసవి నగర్,బీఆర్ స్టేడియంలో వసతులు సమస్యలు, పాత గుంటూరులో మంత్రులు పర్యటించారు. దీంతో ఇద్దరు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్నాళ్లుగా ఇసుక అందుబాటులో లేక పనులు నిలిచిపోవడంతో కోపాద్రిక్తులైన భవన నిర్మాణ కార్మికులు వారిని అడ్డుకున్నారు.

  నగరానికి వచ్చిన మంత్రుల్ని అడ్డుకుని నిలదీశారు. ప్రభుత్వం విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు.


  భూగర్భ డ్రైనేజీ పనులు గడువు వచ్చే నెలతో పూర్తి అవుతుంది. కానీ పనులు మాత్రం 50 శాతం మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. గుత్తేదార్లను మార్చాలనే ఆలోచన తమకు లేదన్నారు. అత్యవసరమైన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రతి పని రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదన్నారు బొత్స. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగుతాయన్నారు. సచివాలయ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు కావాలన్నారు మంత్రి బొత్స. వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

  ఇవికూడా చూడండి:
  విజయవాడ అమరావతి రాకపోకలు బంద్

  Published by:Sulthana Begum Shaik
  First published:October 26, 2019, 12:34 IST

  टॉप स्टोरीज