HOME »NEWS »POLITICS »guntur officials demolish kodela sivaprasad rao statue piller sb

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత
కోడెల విగ్రహ దిమ్మె కూల్చివేత

ఇవాళ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు షాకిచ్చారు.

 • Share this:
  దివంగత నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ ఏర్పాటులో వివాదం నెలకొంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించాలనుకున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు ఆ ప్రాంతలో దిమ్మెను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయమై అర్థరాత్రి లింగరావుపాలెంలో టెన్షన్ నెలకొంది. ఇవాళ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు షాకిచ్చారు. విగ్రహ దిమ్మెను ధ్వంసం చేశారు. వారం క్రితమే విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరామని అయినా అధికారులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నామని టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

  కోడెల విగ్రహ దిమ్మె కూల్చివేత
  పాలకేంద్రం వద్ద దిమ్మెను నిర్మించిన టీడీపీ నేతలు నేడు విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని ఆదివారం రాత్రి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
  Published by:Sulthana Begum Shaik
  First published:September 30, 2019, 08:52 IST

  टॉप स्टोरीज