news18-telugu
Updated: December 1, 2019, 2:58 PM IST
Video : అమరావతిలో చంద్రబాబు పర్యటన.. డ్రోన్ దృశ్యాలు
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై నిరసనకారులు చెప్పులు రాళ్లు విసిరారు. అయితే బాబు పర్యటనలో తలెత్తిన ఘర్షణపై ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ స్పందించారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పర్యటించేందుకు చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నారు. పది గంటలకు కరకట్ట నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమైందని తెలిపారు. ఉదయం 10.17 గంటలకు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు బాబు కాన్వాయ్ చేరుకుందన్నారు. అయితే నిరసనకారులు బాబు ప్రయాణిస్తున్న బస్సు పైకి చిన్నరాయి, ఓ చెప్పు విసిరారని, లాఠీ విసిరారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బస్సుపై దాడికి పాల్పడిన వారిపై 352, 290,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. పోలీసుల తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల పాత్రపై వారం రోజుల్లోగా నివేదిక అందిస్తామని ఐజీ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబు ప్రయాణించిన బస్సున సీజ్ చేశామన్నారు. బస్సు అద్దం కొంత మేరకు ముందుభాగంలో పగిలిందని అన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా చంద్రబాబుపై అమరావతిలో జరిగిన దాడి ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రురల్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సిట్ బృందానికి ఇంచార్జ్‌గా వ్యవహరించనున్నారు. అమరావతిలో జరిగిన ఘర్షణతొ పాటు పోలీసులు అలసత్వం పై కూడా సిట్ బృందం విచారణ చేయనున్నారు. ఇప్పటికే బాపయ్య, సందీప్ అనే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. తుళ్లూరు పోలీసు స్టేషన్ లో పెట్టిన అన్ని కేసులు సిట్ కి బదిలీ చేశారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 1, 2019, 2:58 PM IST