• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GUNTUR DISTRICT COLLECTOR MADE KEY COMMENTS ON MOBILE PHONE ALLOWED INTO POLLING CENTERS HERE ARE THE DETAILS PRN

AP Municipal Elections: పోలింగ్ బూత్ లోకి ఫోన్ తీసుకెళ్లొచ్చు.. కానీ ఒక్క షరతు

AP Municipal Elections: పోలింగ్ బూత్ లోకి ఫోన్ తీసుకెళ్లొచ్చు.. కానీ ఒక్క షరతు

ప్రతీకాత్మక చిత్రం

AP Municipal Elections: ఈ రోజుల్లో యువతో పాటు పెద్దలకు సెల్ఫీలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఎక్కడికెళ్లినా ఏం చేసినా సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరుగుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజుల్లో యువతో పాటు పెద్దలకు సెల్ఫీలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఎక్కడికెళ్లినా ఏం చేసినా సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ బూత్ లోకి ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లచ్చన్నారు. ఐతే వెళ్లే ముందు మొబైల్ ఫోన్ స్విఛ్ ఆఫ్ చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు.

    పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే భద్రతా సిబ్బంది ఈ విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియోలు రికార్డ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చిన వారు తప్పనిసరిగా స్విఛ్ ఆఫ్ చేయాలని స్పష్టం చేశారు.

    ఇది చదవండి: తిరుపతిలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ మధ్య వార్



    నిబంధనలు ఏం చెప్తున్నాయంటే..?
    పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదు. ఓటు వేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకోవడం నిషేధం. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 49(M) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయడం నేరం. ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో సెల్ఫీ తీయకూడదు అలా చేస్తే సెక్షన్ 17(A) ప్రకారం ఓటును రద్దు చేస్తారు. అంతేకాదు అలా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇక ఓటు వేసే సమయంలో సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాదు.. ఫేస్ బుక్ లైవ్, ట్విట్టర్ లైవ్ అంటూ సోషల్ మీడియాలో పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం.

    ఇక పోలింగ్ కేంద్రంలో నినాదాలు చేయడం, అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు, కరపత్రాలు తీసుకెళ్లడం నిషేధం. అలా చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. ఐతే మొబైల్ ఫోన్ల విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన వెసులుబాటును ఓటర్లు స్వాగతిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: