BJP leader Back to TDP: రాజకీయ నేతల (Political Leaders) మాటలకు అర్థాలే వేరులే అనే విధంగా పరిస్థితి మారింది. బయటకు ఒకటి చెబుతారు.. మరొకటి చేస్తారు.. పార్టీ మారేది లేదని ఒట్లేసి చెబుతారు.. క్షణాల్లోనే మాట మార్చేస్తారు. పార్టీ ఏదైనా రాజకీయ నాయకుల నిర్ణయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకోవడంలో పొలిటీషియన్స్‌ను మించిన వాళ్లు ఎవరూ ఉండరేమో.. అవకాశం వాదం అనే పదం వాళ్లను ఉద్దేశించి పెట్టినదేమో అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచిన గుంటూరు (Guntur) రాజకీయాల్లో అదే జరుగుతోంది. అమరావతి రైతులు (Amaravati farmers) చేస్తున్న పాదయాత్ర ద్వారా సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండే క్రితం టీడీపీ (tdp)ని వీడి రావెల కిషోర్ (Ravela Kishore) బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన కాషాయం కండువా కప్పుకొని బయటకు వస్తున్నా.. ఆయన మనసంతా టీడీపీలో ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బీజేపీ (BJP) లో చేరినా.. తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రావెలకు ఇప్పుడా అవకావాన్ని కల్పించిందని, అందుకే తాటికొండలో మొదలైన పాదయాత్రను అంతా తానై తిరుమల వరకు నడిపిస్తుండడంలో రావెల ప్లాన్ రెడీ చేశారని సమాచారం..
అమరావతి పాదయాత్రనను ఆయనే దగ్గరుండి చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాదయాత్రకు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా ఎవరు వచ్చినా వారిని ఆహ్వానించి రావెల సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ నేతలతో ఆయన ఆయన మరి క్లోజ్ గా ఉంటున్నారు. తాను టీడీపీలోనే ఉన్నట్టు ఫీలవుతూ టీడీపీ నేతలు ఎరపతినేని, ధూళిపాళ్ల, ప్రత్తిపాటి లాంటి సీనియర్ లీడర్లను అంటుకుని తిరుగుతున్నారు.
రావెల అనవసరంగా బీజేపీలోకి వెళ్లారని కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. రావెల కూడా తాను ఎప్పుడూ మీ వాడినే అంటూ వారిని కుషీ చేస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మందకృష్ణ, చంద్రబాబుల మధ్య జరిగిన రహస్య భేటీలో రావెల కీలకంగా పనిచేశారని కూడా తెలుగు తమ్ముళ్ల వెర్షన్. దీంతో టీడీపీలోకి రావెల రీ ఎంట్రీ ఖాయమని, అధినేత అంగీకారం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే
ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా బలంగా ఉండాలి అంటే రెండే రెండు ఆప్షన్లు అని రాజకీయ నేతల ఫీలింగ్. అయితే అధికార వైసీపీలో ఉండటం లేదా ప్రతిపక్ష పార్టీలో ఉండడం.. తప్పని సరిపరిస్థితుల్లో జనసేన వైపు చూడడం తప్ప మరో మార్గం చూసుకుంటే రాజకీయ జీవితం నాశనం చేసుకున్నట్టే అని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఫీలవుతున్నట్టు సమాచారం. ఎలాగూ వైసీపీలో చేరే ఛాన్స్ లేకపోవడం, తనను మంత్రిని చేసిన చంద్రబాబుపై కృతజ్ఞత ఉండటంతో.. సైకిల్ ఎక్కడం ఒక్కటే తనముందున్న మార్గం అని రావెల భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూడా రావెల రీ ఎంట్రీతో ఎస్సీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని ఆలోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Bjp, TDP