• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GUJARAT MUNICIPAL ELECTION RESULTS 2021 BJP CLEAN SWEEP IN MUNICIPAL ELECTIONS AAP UPSETS CONGRESS IN SURAT SK

Gujarat Municipal Election Results: బీజేపీకి బిగ్ బూస్ట్.. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్.. ఆమాద్మీ బోణీ

Gujarat Municipal Election Results: బీజేపీకి బిగ్ బూస్ట్.. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్.. ఆమాద్మీ బోణీ

ప్రతీకాత్మక చిత్రం

Gujarat Municipal Election Results: సూరత్ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ఏకంగా 27 సీట్లు గెలవడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విజయాన్ని ఆప్ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 26న ఢిల్లీ సీఎం, ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్‌లో పర్యటించనున్నారు. పార్టీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొంటారు.

  • Share this:
    గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇలాఖాలో తమకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది. 6 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను..మొత్తం ఆరింట కమల దళం విజయ దుందుభి మోగించింది. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదరా, భావ్ నగర్, జామ్ నగర్‌ కార్పొరేషన్‌లను కైవసం చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక అహ్మదాబాద్‌లో ఎంఐఎం, సూరత్‌లో ఆమాద్మీ పలు వార్డుల్లో విజయం సాధించాయి. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 576 డివిజన్లలో బీజేపీ 466 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాలకే పరిమితమయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ఆమాద్మీ సూరత్‌లో సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో ఎంఐఎం మెరుగైన ప్రదర్శన చేసింది.

    కార్పొరేషన్ల వారీగా ఫలితాలు:
    1. అహ్మదాబాద్‌లో మొత్తం 192 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 161 స్థానాలు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. కాంగ్రెస్ 15 చోట్ల విజయం సాధించింది. ఇక ఎంఐఎం 7 సీట్లలో గెలిచింది. మరికొన్ని సీట్లలో ఫలితాలు రావాల్సి ఉంది.

    2. సూరత్‌లో 120 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ 93 స్థానాల్లో గెలిచింది. తొలిసారి పోటీచేసిన ఆమాద్మీ 27 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

    3. వడోదరాలో మొత్తం 76 స్థానాలున్నాయి. బీజేపీ 69 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ ఏడు సీట్లకే పరిమితయింది.

    4. రాజ్‌కోట్‌లో మొత్తం 72 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 68 స్థానాల్లో గెలిచింది. మిగిలిన నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది.

    5. జామ్ నగర్‌లో 64 స్థానాలున్నాయి. అక్కడ బీజేపీ 50 సీట్లలో విజయం సాధించి సత్తా చాటింది. కాంగ్రెస్ 11, బీఎస్పీ 7 సీట్లలో గెలుపొందింది.

    6. భావ్‌నగర్‌లో 52 డివిజన్లు ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 44 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 8 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.






    ఐతే సూరత్ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ఏకంగా 27 సీట్లు గెలవడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విజయాన్ని ఆప్ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 26న ఢిల్లీ సీఎం, ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్‌లో పర్యటించనున్నారు. పార్టీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొంటారు.

    ఆదివారం రోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. అహ్మదాబాద్‌లో 42.5 శాతం, జామ్‌నగర్‌లో 53.4 శాతం, రాజ్‌కోట్‌లో 50.7శాతం, భావ్ నగర్‌లో 49.5 శాతం, వడోదరాలో 47.8 శాతం, సూరత్‌లో 47.1 శాతం పోలింగ్ నమోదయింది. ఈ ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 52.33 లక్షల మంది మాత్రమే ఓటు వేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు