‘నమస్తే ట్రంప్’ వల్లే గుజరాత్‌లో కరోనా వ్యాప్తి... మండిపడ్డ కాంగ్రెస్

గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్దా తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి నమస్తే ట్రంప్ కార్యక్రమమే కారణమని ఆరోపించారు.

news18-telugu
Updated: May 6, 2020, 7:23 PM IST
‘నమస్తే ట్రంప్’ వల్లే గుజరాత్‌లో కరోనా వ్యాప్తి... మండిపడ్డ కాంగ్రెస్
మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం (ఫైల్ ఫోటో)
  • Share this:
దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతోంది గుజరాత్‌లోనే. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన నమస్తే ట్రంప్ కారణమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్దా ఈ అంశంపై సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలోనే తాను గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు ప్రకటించారు. వీడియో మేసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరిలోనే కరోనా వైరస్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందని... అయినా బీజేపీ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా లక్షల మందితో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించిందని అన్నారు.

ఈ కార్యక్రమం కోసం వేలాది మంది విదేశీయులు కూడా గుజరాత్‌కు వచ్చారని... వారి ద్వారా రాష్ట్రంలోకి ఈ వైరస్ ప్రవేశించిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ వాలా అన్నారు. ట్రంప్ ఏ దేశంలో పర్యటించడానికైనా ముందు అమెరికాకు చెందిన బృందం అక్కడ పర్యటించి సెక్యూరిటీతో పాటు ఆరోగ్య సంబంధమైన అంశాలను కూడా పరిశీలిస్తుందని వాలా తెలిపారు. ఆ బృందం ఓకే చెప్పిందే ట్రంప్ ఏ దేశంలోనూ పర్యటించరని స్పష్టం చేశారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 6245 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 1381 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 368 మంది చనిపోయారు.
Published by: Kishore Akkaladevi
First published: May 6, 2020, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading