Home /News /politics /

GREATER HYDERABAD CONGRESS LEADER KOPPULA NARSIMHAREDDY JOINS IN BJP NS

Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ముఖ్య అనుచరుడు.. బీజేపీలో చేరిక

టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యికోట్ల కుంభకోణం 

జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే 

అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు.

టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ ను వీడి.. కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయంశమైంది. ఈ ఊహించని పరిణామం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది.

    రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలు రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే హోరాహోరీగా జరిగిన ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. దీంతో తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఊపును కొనసాగించి సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలతో ఆ పార్టీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరో వైపు వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలకు కాషాయ కండువా కప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ పార్టీల్లో ముఖ్య నేతలు, అసంతృప్తులను గుర్తించి వారికి గాలం వేస్తున్నారు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ ను వీడి.. కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయంశమైంది. ఈ ఊహించని పరిణామం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది.

    2018లో జరిగిన ఎన్నికల్లో ఎల్.బీ.నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన కొన్నాళ్లకు టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి కొప్పుల నర్సింహారెడ్డి ఎల్.బీ.నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి కుడి భుజమని స్థానికంగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం కాంగ్రెస్ పార్టీకి దెబ్బగా మారింది. నిన్న రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నర్సింహారెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. నర్సింహారెడ్డికి కిషన్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

    ఇదిలా ఉంటే.. మన్సూరాబాద్ డివిజన్ నుంచి కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు కాంగ్రెస్ నేతలు సైతం కొప్పుల బాటలోనే బీజేపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై రేవంత్ రెడ్డి వర్గీయులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తాన్న ప్రచారం సైతం సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి నియోజకవర్గంలో అత్యధిక భాగం గ్రేటర్ పరిధిలోనే ఉండడం ఇందుకు కారణం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Hyderabad - GHMC Elections 2020, Revanth reddy, Telangana bjp, Tpcc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు