GRATER VISKHA MUNICIPAL ELECTIONS UPDATE 50 YEARS HISTORY ONLY 5 TIMES ELECTIONS NGS
AP Muncipal Elctions: 50ఏళ్ల చరిత్ర. కానీ ఐదుసార్లే ఎన్నికలు? అసలేం జరింది?
విశాఖ మున్సిపాలిటీ ఏర్పడి 50 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు జీవీఎంసీగా ఫరిధి పెంచుకుంది. కానీ ఈ 50 ఏళ్లలో అక్కడ ఎన్నికలు జరిగింది కేవలం ఐదు సార్లు మాత్రమే..? ఎందుకిలా జరిగింది? తప్పెవరది?
విశాఖ మున్సిపాలిటీ ఏర్పడి 50 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు జీవీఎంసీగా ఫరిధి పెంచుకుంది. కానీ ఈ 50 ఏళ్లలో అక్కడ ఎన్నికలు జరిగింది కేవలం ఐదు సార్లు మాత్రమే..? ఎందుకిలా జరిగింది? తప్పెవరది?
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపై పడింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ నగరానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. దీంతో మహా విశాఖకు మరింత ప్రాచుర్యం లభించింది. ఈ తరుణంలో జీవీఎంసీకి జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఊపందుకుంది. దీనికి తోడు విశాఖ రాజధాని రెఫరెండంగా కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దానికి తోడు చాలా గ్యాప్ తరువాత ఎన్నికలు జరుగుతుండడంతో అందరి దృష్టి జీవీఎంసీపైనే పడింది.
ఇప్పటి వరకు విశాఖ కార్పొరేషన్‌కు ఒక సారి మినహా మిగిలిన ఏ సందర్భంలోనూ పాలక వర్గాల పదవీకాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు జరగలేదు. 2012లోనే గత పాలక మండలి గడువు పూర్తి అయ్యింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మొదట 50 వార్డులతో 1979లో ఏర్పాటైంది. తొలిసారి 1981లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ నేత ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి మేయరుగా ఎన్నికయ్యారు. అప్పుడు పరోక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకున్నారు.1986 వరకు ఆయన మేయర్ గా కొనసాగారు. తరువాత అంటే 1986 నుంచి 1987 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది.
రెండోసారి 1987లో మేయరు పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు టీడీపీ తరపున పోటీ చేసిన డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికయ్యారు.1987 నుంచి 1992 వరకు ఆయనే మేయర్ గా కొనసాగారు. 1992 నుంచి 1995 వరకు మళ్లీ ప్రత్యేక అధికారే పరిపాలన సాగించారు.
మళ్లీ 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి మేయరుగా ఎన్నికయ్యారు. ఆయన 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో కొనసాగారు. తరువాత ప్రత్యేక అధికారి పాలనకు అవకాశం ఇవ్వకుండా వెంటనే 2000లో జీవీఎంసీ పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించారు. 2000లో మేయరుగా మాజీ ఎమ్మెల్యే రాజాన రమణి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది.
ఆ తరువాత ప్రత్యేక అధికారి పాలనలో విశాఖ మున్సిపాలిటీని.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చారు. గాజువాక మున్సిపాలిటీ, 32 పంచాయతీలను విలీనం చేసి వార్డుల సంఖ్యను 72కు పెంచారు. దీంతో 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి పరోక్ష పద్దతిలో మేయరును ఎన్నుకున్నారు. 2007లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మేయరుగా పులుసు జనార్దనరావు ఎన్నికయ్యారు. 2012లో ఆ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రత్యేక అధికార పరిపాలనే కొనసాగుతోంది.
దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న జీవీఎసీం పరిధిని ఇంకాస్త విస్తరించారు. ఈసారి అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు కొన్ని పంచాయతీలను జీవీఎంసీ పరిధిలోకి తెచ్చి వార్డుల పునర్విభజన చేశారు. దీంతో ప్రస్తుతం వార్డుల సంఖ్య 98కు చేరింది. 50 వార్డులతో మొదలైన విశాఖ కార్పొరేషన్ ప్రస్థానం 98 వార్డులకు చేరింది. 1971లో ఏర్పాటైన విశాఖ కార్పొరేషన్‌కు 50 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అయిదుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.