GRAMA VOLUNTEER CONTESTING IN PANCHAYAT ELECTIONS IN ANANRHAPURAM DISTRICT OF ANDHRA PRADESH PRN
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల బరిలో మహిళా గ్రామ వాలంటీర్.. ఏ ఊళ్లోనో తెలుసా?
కురుబ సత్యవతి (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) నామినేషన్ల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు (Grama Volunteers) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పంచాయతీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. అన్నివర్గాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్ని పంచాయతీల్లో అయితే వేరే ప్రాంతంలో చేస్తున్న ఉద్యోగాలను కూడా వదులుకొని పోటీకి సై అంటుటంటారు. ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం గ్రామ వాలంటీర్లు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడు మండలం, ప్రసన్నాయపల్లికి చెందిన గ్రామ వాలంటీర్ సత్యవతి సర్పంచ్ పోటీకి సిద్ధమయ్యారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆమెను వైసీపీ బలపర్చిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డిగ్రీ వరకు చదువుకున్న సత్యవతి.., గ్రామ వాలంటీర్ గా ఎంపికయ్యారు.
గ్రామంలోని అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలు అందించడంలో చురుగ్గా వ్యవహరిస్తోందని స్థానికులు చెప్పారు. అంతేకాదు మండలంలోనే ఉత్తమ వాలంటీర్ గా అవార్డును కూడా అందుకుంది. సత్యవతి సర్పంచ్ అయితే గ్రామం అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమెను పిలిచి మాట్లాడిన ఎమ్మెల్యే.., పోటీ చేస్తే వైసీపీ తరపున మద్దతిస్తామని ప్రకటించడంతో అందుకు అంగీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రసన్నాయపల్లి గ్రామానికి చెందిన కురుబ సత్యవతి వాలంటీర్ గా మంచి సేవలు అందించడంతో అధికారులు కూడా బెస్ట్ వాలంటీర్ గా ఎంపిక చేయడం జరిగిందన్నారూ. సచివాలయంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అనుభవం ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందించడంలో ముందువరుసలో ఉండడంతో అధికారులు గుర్తించి మండల ఉత్తమ వాలంటీర్ గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. చదువులో డిగ్రీ పూర్తిచేయడం, వాలంటరీ ఉద్యోగంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే అనుభవం ఉండటం.., ఆమె కుటుంబం ప్రసన్నయపల్లి గ్రామంలో ఉంటూ మంచి గుర్తింపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.