ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ల నియామకాలు హైకోర్టులు మెట్లు ఎక్కింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారధులుగా గ్రామ వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. కానీ, ఇవే ఎంపికలు ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య వివాదాలను రాజేస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో గ్రామవాలంటీర్ పరీక్ష రాసిన 86 మంది ఏపీ హైకోర్టు ని ఆశ్రయించారు. గ్రామ వాలంటీర్ పోస్టుకు తాము ఎంపిక అయినా కూడా తమను శిక్షణా తరగతులకు అధికారులు అనుమతించలేదంటూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటరమణ.. ప్రకాశం జిల్లా కలెక్టర్, చీరాల, వేటపాలెం ఎంపీడీవో లకు నోటీసులు జారీచేశారు.
గ్రామవాలంటీర్ గా ఎంపిక అయినా శిక్షణకు హాజరుకాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. గ్రామ వాలంటీర్ పోస్టుకు తాము మొదట ఎంపిక అయినట్లు తమ 86 మంది పేర్లూ... ఎంపీడీవో కార్యాలయంలోని నోటీస్ బోర్డులో తెలిపారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆగస్ట్ 7 నుంచి 12 వరకు గ్రామవాలంటీర్ శిక్షణ తరగతులు జరిగాయని.. అక్కడ తరగతులకు వెళ్లిన 86 మంది అభ్యర్థులను క్లాసులు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని చెబుతున్నారు. . ఈ విషయం ప్రకాశం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా పిటిషనర్లకు న్యాయం జరగలేదని వారి బాధితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
గ్రామ వాలంటీర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయిన నాటినుంచి రాజకీయ ఒత్తిడులు చోటుచేసుకోవడంతోనే ఈ వివాదం చెలరేగింది. ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్, చీరాల, వేటపాలెం ఎంపీడీవోలకు నోటీసులు జారీచేసి... పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలనీ ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.