హోమ్ /వార్తలు /రాజకీయం /

గ్రామ పంచాయతీ ఎన్నికలు : రెండో విడుత బరిలో 10,668 సర్పంచ్ అభ్యర్థులు

గ్రామ పంచాయతీ ఎన్నికలు : రెండో విడుత బరిలో 10,668 సర్పంచ్ అభ్యర్థులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 30 నుంచి జరగనున్న మూడో విడుత పంచాయతీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

  ఈ నెల 21 నుంచి జరగాల్సిన రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 3,342 స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అలాగే 26,191 వార్డులకు గాను 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.


  రెండో విడుతలో మొత్తం 4135 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 788 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3342 స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించబోతుంది. వార్డులకు సంబంధించి మొత్తం 36,602 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 10,317 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 26,191వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.


  ఇక ఈ నెల 30 నుంచి జరగనున్న మూడో విడుత పంచాయతీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మూడో విడుతలో 4116 సర్పంచ్ స్థానాలు, 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

  First published:

  Tags: Gram Panchayat Elections, Telangana, Trs, TS Congress

  ఉత్తమ కథలు