
ఒమర్ అబ్దుల్లా
JammuKashmir : ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోనుంది. ఇకపై అక్కడ భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుంది. జమ్మూకాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం విభజించింది.
జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం అని, రాజ్యాంగ విరుద్దం అని కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఇది మోదీ సర్కార్ చేసిన నమ్మకద్రోహం అని విమర్శించారు.కేంద్రం నిర్ణయం వల్ల భవిష్యత్‌లో దారుణమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చని హెచ్చరించారు.ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో పాటు మరికొందరు నేతలు కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు.కాశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ,టీఎంసీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోనుంది. ఇకపై అక్కడ భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుంది. జమ్మూకాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం విభజించింది.
Published by:Srinivas Mittapalli
First published:August 05, 2019, 14:47 IST