• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GOVT HAS DECIDED TO WITHDRAW SPG PROTECTION FROM THE GANDHI FAMILY SK

గాంధీ ఫ్యామిలీకి బిగ్ షాక్.. SPG సెక్యూరిటీ తొలగింపు

గాంధీ ఫ్యామిలీకి బిగ్ షాక్.. SPG సెక్యూరిటీ తొలగింపు

ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

SPG భద్రతపై సమయానుగుణంగా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు ఎస్పీజీ భద్రతను తొలగిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేనందున ఎస్పీజీ తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

  • Share this:
    గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీకి SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) భద్రతను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని పలు నిఘా ఏజెన్సీలు వెల్లడించిన నేపథ్యంలో.. వారికి SPG భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. SPG.. దేశంలోని అత్యున్నత భద్రతా విభాగం. గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ సెక్యూరిటీని తొలగిస్తే.. వారికి CRPF సిబ్బందితో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. 1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సొంత బాడీ గార్డ్స్ హత్య చేసిన తర్వాత.. 1985లో కేంద్ర ప్రభుత్వం SPG ని ఏర్పాటు చేసింది. SPGలో ప్రస్తుతం 3వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం నలుగురికి మాత్రమే SPG సెక్యూరిటీ ఉంది. వారిలో ఒకరు ప్రధాన మంత్రి మోదీ కాగా.. మిగిలిన ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు. ఎస్పీజీ భద్రతపై సమయానుగుణంగా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు ఎస్పీజీ భద్రతను తొలగిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేనందున ఎస్పీజీ తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు