తెలంగాణ గవర్నర్ బదిలీ... జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి నరసింహన్ ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కవ కాలం పని చేసిన గవర్నర్‌గా నరసింహన్ చరిత్ర సృష్టించారు.

news18-telugu
Updated: August 5, 2019, 9:09 AM IST
తెలంగాణ గవర్నర్ బదిలీ... జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి నరసింహన్ ?
త్వరలో తెలంగాణ గవర్నర్ బదిలీ
  • Share this:
త్వరలో తెలంగాణ గవర్నర్ బదిలీ కానున్నారా? నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్ రాష్ట్రానికి రానున్నారా ? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా దాదాపు పది సంవత్సరాలుగా ఉన్న ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ఎట్టకేలకు బదిలీ కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా నరసింహన్ బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. అందుకే ఆ లోగా రాష్ట్ర విభజన సమస్యలకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆయనను ఆదేశించినట్టు సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలపై భేటీల్ని వేగవంతం చేశారు. కేసీఆర్, వైఎస్ జగన్ రాష్ట్ర విభజన సమస్యలపై వరుస భేటీలతో, గవర్నర్ నరసింహన్ సమక్షంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరోవైపు డిసెంబర్ నాటికి గవర్నర్‌గా నరసింహన్‌కు పది సంవత్సరాలు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కవ కాలం పని చేసిన గవర్నర్‌గా నరసింహన్ చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో నరసింహన్ గవర్నర్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా గత నెల జూలై 16వ తేదీ వరకు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా బిశ్వభూషణ హరిచందన్‌ను నియమించి తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. గతంలో కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం.


First published: August 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు