శేషజీవితం చెన్నైలోనే... నో పాలిటిక్స్... తేల్చేసిన నరసింహన్

గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత ఏం చేయబోతున్నాననే అంశంపై స్పందించారు నరసింహన్.

news18-telugu
Updated: September 3, 2019, 5:42 PM IST
శేషజీవితం చెన్నైలోనే... నో పాలిటిక్స్... తేల్చేసిన నరసింహన్
గవర్నర్ నరసింహన్(ఫైల్ ఫోటో )
news18-telugu
Updated: September 3, 2019, 5:42 PM IST
గవర్నర్‌గా పదవీ విమరణ చేసిన తరువాత చెన్నైలోనే ఉంటానని నరసింహన్ స్పష్టం చేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన నరసింహన్ అనేక అంశాలపై మాట్లాడారు. పదేళ్ల పాటు గవర్నర్‌గా ఉంటానని తాను ఏనాడూ ఊహించలేదని నరసింహన్ అన్నారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత చెన్నైలోనే ఉంటానన్న నరసింహన్... వడ, సాంబారు తింటూ కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పిన నరసింహన్... రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. తన పదేళ్ల పదవీ కాలంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా నరసింహన్ స్పందించారు.

తాను గుళ్లు, గోపురాలు తిరుగుతాననే వార్తలపై స్పందించిన నరసింహన్... అది పూర్తిగా వ్యక్తిగత జీవితమని వ్యాఖ్యానించారు. తనను కొందరు పూజారిగా అభివర్ణించారని...అంతకంటే భాగ్యం మరేముంటుందని ఛలోక్తులు విసిరారు. పదవీ విమరణ తరువాత పూజారిగా మారతానేమో చెప్పలేనని అన్నారు. తాను తిరుపతి, యాదాద్రి, భద్రాచలం, ఖైరతాబాద్ ఆంజనేయ స్వామి ఆలయాలను మాత్రమే దర్శించానని అన్నారు. తనను జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా వెళతారనే వార్తలతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తారనే వార్తలపై కూడా నరసింహన్ స్పందించారు. తనకు తెలియకుండా ఇలాంటి వార్తలు మీకెలా తెలుస్తాయని సెటైర్లు వేశారు.


First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...