• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GOVERNOR NARASIMHAN OBJECTION OVER TELANGANA NEW MUNICIPAL ACT 2019 BILL MS

కేసీఆర్‌కు షాక్ : కొత్త మున్సిపల్ బిల్లుకు గవర్నర్ బ్రేక్

కేసీఆర్‌కు షాక్ : కొత్త మున్సిపల్ బిల్లుకు గవర్నర్ బ్రేక్

సీఎం కేసీఆర్ (File)

గవర్నర్ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులో కొన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడటంతో ప్రభుత్వం బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

  • Share this:
    తెలంగాణ చట్ట సభ ఆమోదించిన కొత్త మున్సిపల్ చట్టం-2019 బిల్లుకు గవర్నర్ బ్రేక్ వేశారు. బిల్లులో పొందుపరిచిన కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం అధికారాలను ప్రభుత్వం ఆధీనపరుచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో గవర్నర్ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులో కొన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడటంతో ప్రభుత్వం బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు సమాచారం. తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్రానికి పంపించనున్నారు. కేంద్రం ఆమోదం పొందితే ఈ బిల్లు అమలులోకి రానుంది. కాగా, ఈ నెల 19న కొత్త మున్సిపల్ చట్టాన్ని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ దీనికి ఆమోదం పలికింది.
    First published:

    అగ్ర కథనాలు