• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • GOVERNMENT READY FOR E AUCTION TO LANDS IN VISAKHAPATNAM 18 LANDS ARE IDENTIFIED NGS

Andhra pradesh: విశాఖలో సర్కార్ వారి పాట. బీచ్ ను కూడా? ధర ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

Andhra pradesh: విశాఖలో సర్కార్ వారి పాట. బీచ్ ను కూడా? ధర ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

విశాఖలో భూములు అమ్మకానికి రంగం సిద్ధం

విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మాకానికి రెడీ అయ్యాయి. దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విశాఖలో సంపద దోచుకోవడానికే ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిందని.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోందంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు.

 • Last Updated:
 • Share this:
  ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అక్కడ ఏం జరిగినా ఎన్నో అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే నగర విస్తీర్ణం పెరిగింది. వ్యాపారాలు విస్తరించాయి. ఐటీ హబ్ గా మారుతోంది. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అందర్నీ అహ్వానిస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న విశాఖపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న జనభా కారణంగా కాంక్రిట్ జంగిల్ గా మారుతోంది. ఇక్కడ భూములు దొరకడమే గగనమైపోయింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలుకు గురవుతోంది.

  తాజాగా విశాఖపట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ భూములను విక్రయించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని నవరత్న సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ దీనిపై ప్రకటన చేసింది. ఇందులో ప్రముఖంగా ఆర్కే బీచ్ రోడ్డులో ఉన్న ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా.. మొత్తం 18 భారీ ఆస్తులు ఉన్నాయి. అలాగే, బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను 1 వేయి 452 కోట్ల రూపాయిలుగా ఎన్‌బీసీసీ నిర్ణయించింది.

  అయితే దీనిపై పెను దుమారం రేగుతోంది. గతంలో లూలూ కంపెనీకి కేటాయించిన భూములు కూడా ఇందులో ఉన్నాయి. విశాఖలో అత్యంత ఖరీదైన బీచ్‌రోడ్డు పక్కనే ఉన్న 13.59 ఎకరాల స్థలంలో లులూ సంస్థ భారీ కన్వెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంది. అలాగే మాల్‌‌తో పాటూ మరికొంత అభివృద్ధి చేయాలని భావించింది. ఇక్కడ ఏపీఐఐసీ దగ్గర 10.65 ఎకరాలే ఉండగా, దానిని ఆనుకొని బీచ్‌కు అభిముఖంగా వున్న 3.4 ఎకరాలను సీఎంఆర్‌ గ్రూపు నుంచి తీసుకుంది. అందుకు ప్రతిఫలంగా వారికి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన భూములను ఇచ్చింది. ప్రభుత్వంతో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఆ ఒప్పందం నుంచి లూలూ సంస్థ వైదొలగడంతో ఆ స్థలం ప్రభుత్వపరమైంది. రెండేళ్లుగా ఆ భూమి ఖాళీగానే ఉంది.

  వాటికి సంబంధించిన స్థలాల వివరాలు, ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను ఎన్‌బీసీసీ తమ సైట్ లో పెట్టింది. మిషన్ బిల్డ్ ఏపీ లో పేరుతో కొన్ని స్థలాలను ఏపీ ప్రభుత్వం విక్రయించాలని గతంలోనే నిర్ణయించింది. వీటిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్తోంది.

  విశాఖలోని ప్రముఖ స్థలాలకు ప్రభుత్వం తరపున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని పేర్కొంది. దరఖాస్తు ఫాంను కూడా ఇంటర్నెట్‌లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ ముందస్తు మొత్తం సమర్పించాలని సూచించింది. ఆ సమయానికి 48 గంటల ముందే ఈ.ఎం.డీ జమ చేయాల్సి ఉంటుంది. అవగాహన కోసం నమూనా ఈ-వేలాన్ని ఈనెల 19 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ-వేలం నిబంధనలు, దీనికి సంబంధించి సమర్పించాల్సిన డాక్యుమెంట్లను అప్లికేషన్ ఫామ్‌లో పొందుపరచారు. ఈ నెల 22 నుంచి 24 వరకు వేలం ప్రక్రియ జరగనుంది.

  ప్రస్తుతం ఈ వ్యహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గత ప్రభుత్వం విశాఖతో పాటు ఏపీ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వం రాజధాని పేరుతో విశాఖలోని విలువైన భూములు అమ్ముకోడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టులతో సమా, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారని.. గంగవరం పోర్టు అదానీ వరమైందని.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కూడా వదలడం లేదని స్థానిక ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: