సీఎం సభకు హాజరయ్యే వారికి ఐడీ కార్డులు..

గ్రామస్తులకు గులాబీ రంగు కార్డులు, అధికారులకు తెలుపు రంగు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

news18-telugu
Updated: July 19, 2019, 10:41 PM IST
సీఎం సభకు హాజరయ్యే వారికి ఐడీ కార్డులు..
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
సీఎం కేసీఆర్ చింతమడక గ్రామ పర్యటన సందర్భంగా సభ, సమావేశానికి హాజరయ్యే గ్రామస్తులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు ఉండాలని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం సభ, సమావేశ నిర్వహణ పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలని కోరారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. సర్వే చేసిన అధికారులే ఇంటింటికీ వెళ్లి సీఎం సభకు హాజరయ్యే గ్రామస్తులకు ప్రతి ఇంటింటికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నామని., గ్రామస్తులకు అందించే కార్డులు గులాబీ రంగులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా అధికారులకు తెలుపు రంగు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

గ్రామంలోని 630 గృహాలను టీమ్ లుగా విభజించి, ప్రతి 30 ఇళ్లకు ఒక్క ఎంపీడీఓతో పాటు అదనంగా మరో ప్రత్యేక అధికారిని నియమించినట్లు వివరిస్తూ.., కేటాయించిన 30ఇళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సభ సమావేశం పూర్తయ్యే వరకు ఉండాల్సిన బాధ్యత అధికారిదేనని తెలిపారు. వర్షాకాల దృష్ట్యా కావాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు