పదవికి రాజీనామా చేస్తా... టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ చంద్రబాబు సర్కార్ ఎందుకు ఓడిపోయిందన్న అంశంపై కూడా గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 13, 2019, 1:17 PM IST
పదవికి రాజీనామా చేస్తా... టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
టీడీపీ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలుగుదేశం పార్టీలో మరో నేత తన అసహన గళం వినిపించారు. ఇప్పటికే కేశినేని నాని పార్టీపై తనకున్న అసహనాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయన బాటలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానంటున్నారు గోరంట్ల. అయితే తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని అన్నారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరుతానన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్లపై గోరంట్ల మండిపడ్డారు. పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు, ఆరు సార్లు ఓడిపోయిన వారికి కూడా పార్టీలో అంత ప్రాధాన్యతను ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. సొంత పార్టీపైనే ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశాలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు.ఇప్పటికే తాను ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. మరో వైపు పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లు పార్టీ పదవుల నుండి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ చంద్రబాబు సర్కార్ ఎందుకు ఓడిపోయిందన్న అంశంపై కూడా గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, జిల్లా, మండల నేతలు సక్రమంగా వ్యవహరించని కారణంగానే ఓటమి పాలు కావాల్సి వచ్చిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>