• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GOONS SHOOTS BJP LEADER AJFAR SHAMSHI IN DAY LIGHT AT MUNGER BIHAR SK

షాకింగ్.. బీజేపీ అధికార ప్రతినిధిపై పట్టపగలే తుపాకీ కాల్పులు..

షాకింగ్.. బీజేపీ అధికార ప్రతినిధిపై పట్టపగలే తుపాకీ కాల్పులు..

అజఫర్ శంషీ

మొత్తం రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలిసింది. ఓ బుల్లెట్ శంషీ తొడలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమయింది. కాల్పులు అనంతరం దుండుగులు పారిపోయారు.

  • Share this:
    బీహార్‌లో పట్ట పగలే గూండాలు రెచ్చిపోయారు. బీజేపీ అధికార ప్రతినిధి అజఫర్ శంషీ (Ajfar Shamshi)పై కాల్పులు జరిపారు. బుధవారం ఉదయం ముంగేర్లోని జమాల్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో అజఫర్ శంషీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం పాట్నాకు తరలించారు. ఐతే ప్రాణాపాయమేమీ లేదని.. కానీ తీవ్రమైన బుల్లెట్ గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. అజఫర్ శంషీ కేవలం రాజకీయ నాయకుడుతో మాత్రమే కాదు. జగ్‌జీవన్ రామ్ కాలేజీలో ప్రొఫెసర్‌‌గానూ పనిచేస్తున్నారు. బుధవారం తన ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్న సమయంలో దుండగులు ఆయన్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు.

    మొత్తం రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలిసింది. ఓ బుల్లెట్ శంషీ తొడలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమయింది. కాల్పులు అనంతరం దుండుగులు పారిపోయారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పట్టపగలే ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శంషీపై కాల్పును బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తీవ్రంగా ఖండించారు. డీజీపీ ఎస్‌కే సింఘాల్‌తో మాట్లాడాలని నిందితులను వదిలిపెట్టవొద్దని కోరినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: