Centeral Government AP Government Friendship: గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం (Central Government), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చిన తరువాత.. తొలిసారి గత రెండు మూడు నెలలుగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. అంతకుముందు ఎప్పుడూ కేంద్రానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. అన్ని విషయాల్లో కేంద్రానికి అడగకుండానే ఏపీ ప్రభుత్వం సహాయం చేస్తూ వచ్చింది. అయితే ఎంపీ రఘురామ రాజు (MP Raghuramkrishnama Raju) అనర్హత అంశం, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) బెయిల్ రద్దు పిటిషన్ అంశాలు తెరపైకి వచ్చిన తరువాత.. రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరిగింది. ఎప్పుడూ లేనిది వైసీపీ ఎంపీలు కేంద్రం ప్రభుత్వం తీరును బహిరంగంగా తప్పు పట్టారు. పార్లమెంట్ లో సైతం కేంద్రానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ముందే నిరసన గళం వినిపించారు. ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet)లో సైతం బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు జగన్ సూచించినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఇదంతా గతం.. ఇటీవల అమిత్ షాను సీఎం జగన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన కలిసిన దగ్గర నుంచి పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదని సీఎం కు తెలుసు అనే వాదన వినిపిస్తోంది. అందుకే ఆయన 15వ తేదీన తీర్పు ఉంటే.. 16వ తేదీని కేబినెట్ భేటీకి పిలుపు ఇచ్చారని అంటున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది కేంద్రం ప్రభుత్వం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెవెన్యూ లోటు నిధులను భారీగా విడుదల చేసింది.
తాజాగా రెవెన్యూ లోటు ఉన్న 17 రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.. ఏకంగా రూ. 9,871 కోట్ల లను రిలీజ్ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఇందులో భాగంగా ఆంధ్ర పదేశ్ కు కేంద్రం ఏకంగా 1438 కోట్లను రిలీజ్ చేసింది. విభజన తర్వాత రెవెన్యూ లోటు లోకి వెళ్లిన ఆంధ్రపదేశ్ కు కరోనా కూడా తోడవ్వడంతో తీవ్ర ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద 1,438 కోట్లు రిలీజ్ చేయడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టైంది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేశామని కేంద్రం ఆర్థిక శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఓ బామ్మ కొంప ముంచి ఆధార్ కార్డు.. అసలేం జరిగిదంటే..?
ఇక కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సహాయం పై ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ స్పందించారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం మొదటి విడతగా రూ.581.70 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామ పంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్ లకు 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ అయ్యిందని చెప్పారు.
లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు కేటాయిస్తూ ఉంటుంది. దీంతో 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర పన్నుల వాటా కాకుండా అదనంగా 2021 -22లో రూ.17,257 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూ.8,628.50 రిలీజ్ చేసింది. ప్రస్తుతం కేంద్రం లోటు భర్తీ నిధులు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వానికి కొంచెం రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఢిల్లీలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఉన్నతాధికారులందరినీ కలిశారు. ఈ క్రమంలో ఏపీ రుణ పరిమితిని పెంచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Central governmennt, Pm modi