జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గుడ్ న్యూస్...

హైకోర్టు తీర్పుతో పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగింది. పోలవరం ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా కన్‌స్ట్రక్షన్ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో దక్కించుకుంది.

news18-telugu
Updated: October 31, 2019, 5:09 PM IST
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గుడ్ న్యూస్...
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తీపికబురు అందించింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దును సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతోపాటు ఈ పిటిషన్‌పై విచారణను కూడా ముగించింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలను ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్‌ను కూడా పక్కనపెట్టింది. దిగువ కోర్టు తీర్పును తప్పు పట్టిన హైకోర్టు.. ఇరు పార్టీల వాదనలు విని, మళ్లీ తీర్పును పునఃపరిశీలించాలని సూచించింది.

హైకోర్టు తీర్పుతో పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగింది. రూ.3,216 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు పనుల రద్దుపై హైకోర్టులో నవయుగ పిటిషన్ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర స్టే ఇచ్చింది. ఇప్పుడు స్టే ఎత్తివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డంకులు తొలగిపోవడంతో పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా కన్‌స్ట్రక్షన్ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో దక్కించుకుంది.

పాక్ రైల్లో అగ్నిప్రమాదం.. 65 మంది సజీవదహనంFirst published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>