వైసీపీలో చేరిన గోకరాజు ఫ్యామిలీ

పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు వైసీపీలో చేరారు.

news18-telugu
Updated: December 9, 2019, 7:08 PM IST
వైసీపీలో చేరిన గోకరాజు ఫ్యామిలీ
వైసీపీలో చేరిన గోకరాజు ఫ్యామిలీ
  • Share this:
బీజేపీ మాజీ గోకరాజు గంగరాజు సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సోమవారం వైసీపీలో చేరారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు కూడా పార్టీలో చేరారు. అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడిన రంగరాజు... వైఎస్‌ జగన్‌ పాలన అద్భుతంగా ఉందని అన్నారు. వైసీపీలో తాను కొత్తవాడిని అనుకోవడం లేదని... ఇక్కడ ఉన్నదంతా మా వాళ్లే అని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నానని... నేడు జగన్ నాయకత్వంలో సొంతగూటికి చేరారని రామరాజు తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు అమితంగా ఆకర్షించాయని అన్నారు. వైఎస్ అంటే అమితమైన అభిమానం అని నరసింహరాజు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నేత పీవీఎల్‌ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: December 9, 2019, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading