తొలి భారత ఉగ్రవాది హిందూనే... కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నరు.

news18-telugu
Updated: May 13, 2019, 1:03 PM IST
తొలి భారత ఉగ్రవాది హిందూనే... కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
కమల్ హాసన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకుపడే కమల్ హాసన్ ఈసారి కూడా అదే బాటలో పయనించారు స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఎవరో చెప్పి సరికొత్త వివాదానికి తెరలేపారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవకురిచి అసెంబ్లీ స్థానానికి వచ్చే ఆదివారం ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు కమల్ హాసన్. ఈ సందర్భంగా మట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అని అదికూడా మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అని చెప్పి సరికొత్త వివాదానికి తెరతీశారు. వాస్తవానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఓట్లను ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు తాను చేయడం లేదని ఉన్న వాస్తవాన్ని చెబుతున్నట్లు కమల్ హాసన్ క్లారిటీ కూడా ఇచ్చారు.

1948లో జరిగిన నాటి గాంధీ హత్యకు సమాధానం ఎవరిస్తారని ప్రశ్నించారు కమల్ హాసన్. భారతీయులు సమానత్వం కోరుకుంటారని చెప్పిన కమల్ హాసన్.. మూడురంగుల జెండాలో ఉన్న రంగులు అన్నీ కలిసి ఉండాలన్నారు. మనుషులంతా అలానే కలిసి ఉండాలని ఒక భారతీయుడిగా తానుకోరుకుంటున్నానన్నారు. అయితే కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. నవంబర్ 2017లో హిందూ అతివాదంపై మాట్లాడి బీజేపీ ఇతర హిందూ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నరు. ముస్లీం ఓట్లను తమవైపునకు తిప్పుకొనేందుకు కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: May 13, 2019, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading