బోటు ఆచూకీ లభ్యం... పెద్ద లంగర్‌కు తగిలిన బోటు

బలమైన వస్తువు బోటుకు తగలడంతో దానిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 2:16 PM IST
బోటు ఆచూకీ లభ్యం... పెద్ద లంగర్‌కు తగిలిన బోటు
గోదావరి బోటు ప్రమాద స్థలం వద్ద సహాయకచర్యలు (File)
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. అయితే బోటు ఆచూకీ లభ్యం అయ్యిందని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. పెద్ద లంగర్‌కు బోటు తగిలిందంటున్నారు. గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గడంతో ధర్మాడి సత్యం టీం మరోసారి బోటు వెలికితీత పనులు చేపట్టారు. బలమైన వస్తువు బోటుకు తగలడంతో దానిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిజానికి ముంబై నుంచీ వచ్చిన ఓ టీమ్... అత్యాధునిక టెక్నాలజీతో బోటును వెలికి తీయాలని నిర్ణయించి... తీరా అది సాధ్యం కాదని చెప్పి... తిరిగి వెళ్లిపోయింది. ఇందుకు కారణం... బోటు 200కు పైగా ఆడుగుల లోతున ఉందని భావించడమే. అయితే ... ధర్మాడి సత్యం టీమ్‌కి ఇలాంటి పడవల్ని బయటకు తీసిన అనుభవం ఉండటంతో... ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ బృందం క్రేన్లకు ఇనుప వైర్లు కట్టి... ఆ వైర్లకు యాంకర్ వేసి... నీటిలోకి వదులుతోంది.బోటును లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు