Home /News /politics /

GOA POLLS MANOHAR PARRIKAR SON NOT IN BJP LIST OF CANDIDATES PVN

Utpal Parikar : మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ బిగ్ షాక్..అసెంబ్లీ టిక్కెట్ నిరాకరణ!

మనోహర్ పారికర్ కుమారుడు(ఫైల్ ఫొటో)

మనోహర్ పారికర్ కుమారుడు(ఫైల్ ఫొటో)

Utpal Parrikar : గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పనాజీ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు ఉహించని షాక్ తగిలింది. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 34 స్థానాలకు బీజేపీ గురువారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉత్పల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌నే పనాజీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
Goa Polls  : ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి-14న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా..మార్చి10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక,గోవాలో అధికార బీజేపీ..అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మరోహర్ పారికర్ మరణం తర్వాత జరుగుతున్న గోవా ఎన్నికల్లో బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ,అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తొలిసారిగా గోవా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుటికేపలుమార్లు గోవాల్ పర్యటించి..స్థానిక ప్రజలను ఆకట్టుకునేలా పలు వాగ్దానాలను గుప్పించారు. అంతేకాకుండా,పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఇటీవల టీఎంసీ,ఆప్ లో చేరిపోయారు.

ఇక,కాంగ్రెస్ కూడా గోవాలో ప్రధాన పోటీదారుగా ఉంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ..ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. ఇతర చిన్న పార్టీలు,స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇటీవల కొద్ది వారాల్లో మాజీ సీఎంతో సహా కాంగ్రెకు చెందిన కీలక నేతలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఎంసీ,ఆప్ లో చేరిపోయిన విషయం తెలిసిందే.

ALSO READ https://telugu.news18.com/news/politics/bhim-army-chief-to-contest-from-gorakhpur-pvn-1170162.htmlUP Election : యోగికి పోటీగా చంద్రశేఖర్ ఆజాద్

అయితే గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పనాజీ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు ఉహించని షాక్ తగిలింది. పనాజీ నియోజకవర్గం టికెట్ ను తనకు కేటాయించాలని ఉత్పల్ పార్టీని కోరినట్లు ఫలితం లేకుండా పోయింది. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 34 స్థానాలకు బీజేపీ గురువారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 34 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌తో పాటు గోవా బీజేపీ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో ఉత్పల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌నే పనాజీ అభ్యర్థిగా ప్రకటించింది.

ఉత్పల్‌కు పార్టీ టికెట్ నిరాకరించడం గురించి విలేకరులు గోవా బీజేపీ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ని అడిగినప్పుడు..."ఉత్పల్ కి ఆఫ్షన్స్ ఇవ్వబడ్డాయి. అతను ఇంకా రేసు నుండి బయట లేడు. మేము అతనికి మరో రెండు ఛాయిస్ లు ఇచ్చాము. కానీ అతను మొదటి ఎంపికను తిరస్కరించాడు మరియు రెండవ ఎంపికను అతనితో చర్చిస్తున్నాం. అతను వేరు సీటు నుంచి పోటీకి అంగీకరించాలని మేము భావిస్తున్నాము. ఉత్పల్ పారికర్ మరియు అతని కుటుంబం మా కుటుంబం" అని సమాధానమిచ్చారు.

ALSO READ UP Election : యూపీలో మళ్లీ బీజేపీనే..అఖిలేష్ కి కష్టమేనన్న తాజా 

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన రెండూ ఉత్పల్‌కు మద్దుతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్..ఉత్పల్‌ ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.మరోవైపు, శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్..పనాజీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉత్పల్‌ పారికర్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అతనికి మద్దతు ఇవ్వాలని అన్ని బీజేపీయేతర పార్టీలను కోరారు. తృణముల్ కాంగ్రెస్,గోవా ఫార్వార్డ్ పార్టీ కూడా ఉత్పల్‌ పారికర్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, అతనిపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టవద్దని. ఇది మనోహర్‌భాయ్‌కి నిజమైన నివాళి అవుతుంది అని సంజయ్ రౌత్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక,ఇవాళ బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో గోవా సీఎం పేరు ఉంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంక్విలిమ్ నియోజకవర్గ నుంచే బరిలోకి దిగుతున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Goa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు