పాకిస్తాన్ వెళ్లిపోండి... ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎక్కడెక్కడో వాళ్లంతా వచ్చి భారతదేశంలో ఉండి.. వేరే దేశాలకు వంతపాడుతున్నారంటూ సీరియస్ అయ్యారు. అంతటితో ఆగకుండా ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు.

news18-telugu
Updated: December 28, 2019, 11:53 AM IST
పాకిస్తాన్ వెళ్లిపోండి... ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ వెళ్లిపోండి... ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • Share this:
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై అట్టుడుకుతున్న వేళ.. ఓ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ ఆందోళనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఎన్ఆర్సీ ఆందోళనల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం ఆయన వీధుల్లో ఇతర పోలీసులతో కలిసి తిరిగారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ఆగిన ఎస్పీ.. అక్కడే ఉన్న కొందరు ముస్లిం యువకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటూవారిని వారిని ప్రశ్నించారు. ఈ వీధిని నేను చక్కదిద్దుతాను అని అన్నారు. దానికి అందులో ఓ యువకుడు బదులిస్తూ మేం నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్తున్నామని తెలిపాడు. అది.. సరే.. మరి మీ దుస్తులపై నలుపు, నీలం రంగు బ్యాడ్జులు ఎందుకు ఉన్నాయి అని ఎస్పీ ప్రశ్నించారు. మీరంతా పాకిస్తాన్ వెళ్లిపోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత దేశంలో ఉండాలని ఇష్టం లేకపోతే వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి అని నారాయణ్ సింగ్ అన్నారు. ఎక్కడెక్కడో వాళ్లంతా వచ్చి భారతదేశంలో ఉండి.. వేరే దేశాలకు వంతపాడుతున్నారంటూ సీరియస్ అయ్యారు. అంతటితో ఆగకుండా ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అందరి అంతు చూస్తాను అని సీరియస్ గా అన్నారు. అసభ్య పదజాలం కూడా ఉపయోగించాడు. ఆయనతో పాటు అక్కడున్న మరో పోలీస్ కూడా ఇదే రేంజ్‌లో అక్కడున్న ముస్లీంలపై సీరియస్ అయ్యాడు. ఒక్క సెకన్‌లో మీ జీవితాల్ని చీకటి చేస్తామంటూ రెచ్చిపోయాడు. యూపీ పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఎస్పీ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎస్పీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.

యూపీలో ఇప్పటికే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్‌ అయ్యారు.


First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు