పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి షాక్.. ఎన్డీయే నుంచి వైదొలిగిన జీజేఎం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో మిత్రపక్షం షాక్ ఇచ్చింది. గోరఖ్ జన్‌ముఖి మోర్చా(జీజేఎం) వ్యవస్థాపకుడు బిమల్ గురుంగ్ తాము ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: October 22, 2020, 11:15 AM IST
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి షాక్.. ఎన్డీయే నుంచి వైదొలిగిన జీజేఎం
బిమల్ గురుంగ్(ఫొటో క్రెడిట్-ANI)
  • Share this:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో మిత్రపక్షం షాక్ ఇచ్చింది. గోరఖ్ జన్‌ముఖి మోర్చా(జీజేఎం) వ్యవస్థాపకుడు బిమల్ గురుంగ్ తాము ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గత మూడేళ్ల నుంచి పరారీలో ఉన్న గురుంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పర్వతశ్రేణి ప్రాంతాల సమస్యల పరిష్కారిస్తామనే హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ ప్రాంతాల అభివృద్దికి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. "మేము 12 ఏళ్ల నుంచి బీజేపీకి మద్దతుగా నిలిచాం. కానీ వాళ్లు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అందుకే ఎన్టీయే నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మేము బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాం. 11 గోర్ఖా కమ్యూనిటీస్‌కు గిరిజన హోదా ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేదు "అని తెలిపారు.

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్డీయే కూటమి నుంచి జీజేఎం తప్పుకోవడం బీజేపీకి ఒకరకంగా ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని గురుంగ్ చెప్పారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మూడోసారి మమత సీఎంగా కావడానికి సహకరిస్తామని చెప్పారు.

డార్జిలింగ్‌ ప్రత్యే రాష్ట్ర హోదా కోసం గురుంగ్‌ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన తరువాత 2017 నుంచి పరారీలో ఉన్నాడు. అతడిపై మొత్తంగా 150కి పైగా కేసులు ఉన్నాయి. ఇక, మూడేళ్ల నుంచి పరారీలో ఉన్న గురుంగ్.. బుధవారం కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని గోర్ఖా భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. అయితే అక్కడే వద్ద ఉన్న పోలీసులు ఆయనను అరెస్టు చేయలేదు. ఇక, తాను మూడేళ్ల నుంచి న్యూఢిల్లీలో ఉన్నానని, రెండు నెలల క్రితం జార్ఖండ్ వచ్చానని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading