సీఎం జగన్ కోసం... తిరుమలకు ఎమ్మెల్యే పాదయాత్ర

ఉదయం 11గంటలకు అర్థవీడు మండలం కాకర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రగా రాంబాబు బయలుదేరనున్నారు.

news18-telugu
Updated: September 4, 2019, 9:49 AM IST
సీఎం జగన్ కోసం... తిరుమలకు ఎమ్మెల్యే పాదయాత్ర
సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం గిద్దలూరు ఎమ్మెల్యే...మొక్కులు చెల్లించుకుంటున్నారు.  ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమల ఇవాల్టీ నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 11గంటలకు అర్థవీడు మండలం కాకర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రగా రాంబాబు బయలుదేరనున్నారు.సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తే తిరుమలకు కాలినడకన వస్తానని ఎమ్మెల్యే రాంబాబు గతంలో మొక్కుకున్నరు.

దీనిలో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో గల ప్రధాన మార్గాల గుండా కడప జిల్లాలోకి వెళ్ళి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించి తిరుమలకు వెళ్లనున్నారు. సుమారు 15 రోజులపాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిసింది. తిరుమలలో ఆయనతో పాటు 100 మందికి పైగా తలనీలాలు తిరుమల స్వామివారికి ఇచ్చేందుకు పాదయాత్రలో చివరి వరకు ఆయన వెంట ఉన్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading