Bandi Sanjay: కేసీఆర్ సొంత జిల్లాలోనే బీజేపీ... సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారన్న బండి సంజయ్

Bandi Sanjay: నిజామాబాద్‌లో కేసీఆర్ బిడ్డను.. దుబ్బాకలో అల్లుడిని ఓడించామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలు కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు.

news18-telugu
Updated: November 11, 2020, 6:29 PM IST
Bandi Sanjay: కేసీఆర్ సొంత జిల్లాలోనే బీజేపీ... సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారన్న బండి సంజయ్
బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
దుబ్బాక ప్రజలు కేసీఆర్‌కు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని కేసీఆర్ పదే పదే అనేవారన్న బండి సంజయ్... ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లాలోనే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడని గుర్తు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గతంలో పాస్‌పోర్ట్ బ్రోకర్ అని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్‌కు బీసీని అధ్యక్షుడిగా నియమించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నిజామాబాద్‌లో కేసీఆర్ బిడ్డను.. దుబ్బాకలో అల్లుడిని ఓడించామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలు కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు చెంచాగాళ్లని ఆరోపించారు. అలాంటి బతుకు ఎందుకు బతుకుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ బీసీలను అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని తప్పుబట్టారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో గ్రేటర్ ప్రజలు బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ అభ్యర్ధించారు.

కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో బీజేపీ గెలవడంతో బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలో కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటితే... తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని భావిస్తున్న బీజేపీ.. ఎలాగైనా గ్రేటర్‌లోనూ దుబ్బాక స్థాయి ఫలితాలు రాబట్టాలని భావిస్తోంది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. మరో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటోంది.
Published by: Kishore Akkaladevi
First published: November 11, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading