Home /News /politics /

GHMC MAYOR ELECTIONS TRS CORPORATOR VIJAYA REDDY GOES OUT OF COUNCIL HALL SK

GHMC: టీఆర్ఎస్‌కు షాక్.. అలిగి వెళ్లిపోయిన కార్పొరేటర్ విజయారెడ్డి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయారెడ్డికి మేయర్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ పెద్దలపై ఆమె అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఆమెకు అనుకూలంగా పీజేఆర్ అభిమానులు నినాదాలు చేశారు.

    జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కార్పొరేటర్, మాజీ సీఎం పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఎన్నికను బహిష్కరించారు. కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు. కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. పని మీద బయటకు వెళ్లానని, మళ్లీ వస్తానని చెప్పారు. కానీ తిరిగి రాలేదు. మేయర్ పదవిపై విజయారెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల జరిగినప్పటి నుంచీ ఆమె పేరు కూడా ప్రధానంగా వినిపించింది. పార్టీ పెద్దలను కూడా విజ్ఞప్తులు చేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రాజ్యసభ సభ్యుడు కేకే కూతురు విజయలక్ష్మీ వైపే మొగ్గుచూపారు.

    మరోవైపు విజయారెడ్డికి మేయర్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ పెద్దలపై ఆమె అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఆమెకు అనుకూలంగా పీజేఆర్ అభిమానులు నినాదాలు చేశారు. తమ నాయకురాలికి కాకుండా, కేకే కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ లక్ష్మీకి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా మద్దతు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయ లక్ష్మీ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారులు ప్రకటించారు.

    నూతన సభ్యుల ప్రమాణ స్వీకారానికి మొత్తం కొత్తగా ఎన్నికైన 149 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార సమావేశానికి హాజరైన 149 మంది కార్పొరేటర్లు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు రాజ్య సభ నుండి ఐదుగురికి గాను ముగ్గురు, 15 ఎమ్మెల్సీలకు గాను 10 మంది, 21 ఎమ్మెల్యే లకు గాను 20 మంది సభ్యులు హాజరయ్యారు. లోక్ సభ సభ్యులు ముగ్గురు ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యులు చేసిన ప్రమాణ స్వీకార ప్రతులను ప్రిసైడింగ్ అధికారికి అందచేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: GHMC, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు