GHMC HYDERABAD ELECTIONS BANDI SANJAY SLAMS CM KCR OVER HIS COMMENTS IN LB STADIUM MEETING SK
Hyderabad: కేసీఆర్‌కు ఓటమి భయం.. హైదరాబాద్‌ను సూరత్ చేస్తాం: బండి సంజయ్
బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
GHMC Elections: హైదరాబాద్‌ను మేము ఇండోర్-సూరత్- అహ్మదాబాద్ చేస్తామని చెబుతున్నామని.. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.
సీఎం కేసీఆర్ (CM KCR) టీఆరెస్ బహిరంగ సభ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ లేకుండా పేలవంగా ముగిసిందని తెలంగాణ (Telangana) బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. తండ్రీ కొడుకులను చూసి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలొచ్చని మరోసారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన బండి సంజయ్.. ఎల్బీనగర్ సభలో చేసిన కేసీఆర్ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రశాంతంగా లేదని.. సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని అన్నారు. హిందూస్థాన్ అనని ఎంఐఎం నేతలతో ఎందుకు దోస్తీ చేస్తున్నావని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు బండి సంజయ్.
'' సీఎం కేసీఆర్ మాటల్లో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీలో ఓడిపోతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతల్లో బీజేపీ భయం పట్టుకుంది. ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగూ భరోసా ఇవ్వడు. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర సీఎంలు వస్తే విమర్శలు చేస్తారా? వరదలప్పుడు కేసీఆర్ బయటకు రాడు కానీ..ప్రధానిమోదీ రావాలా? భారత్ బయోటెక్ హైదరాబాద్‌లోనే ఉంది. ఒక్కసారైనా కేసీఆర్ వెళ్లిండా? ఎందుకు పోలేదు? రద నష్టం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందా? కేంద్రం రూపాయి ఇవ్వలేదని ప్రమాణం చేద్దామా? కాషాయ వస్త్రాలు వేసుకున్న స్వామీజీ యూపీ సీఎం..ఆయన్ని తిడుతావా? గల్లీకే పనికిరాని కేసీఆర్..ఢిల్లీకి పనికి వస్తారా? సీఎంగా ఉండి సెక్రటేరియట్ పోలేదు గానీ ఢిల్లీకి పోతారా? కేసీఆర్ రాష్ట్రంలో ఉంటే జరుగుతుందో తెలియదు గానీ.. ఢిల్లీకి వెళ్తే చైనా, పాకిస్తాన్ వాడు వచ్చి తిష్ట వేస్తారు.'' అని బండి సంజయ్ అన్నారు.
ఎంఐఎం పార్టీ భాగ్యనగరం పూర్తిగా విస్తరించే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది..ఎక్కడైనా అల్లర్లు జరిగాయా? అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తులను బీజేపీ కంట్రోల్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి గురించి తెలంగాణను పోల్చడానికే పక్క రాష్ట్రాల నేతలు హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ను మేము ఇండోర్-సూరత్- అహ్మదాబాద్ చేస్తామని చెబుతున్నామని.. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే నగరంలో నేడు సీఎం కేసీఆర్ సభ జరగనుంది. మరోవైపు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక, డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రీపోలింగ్ చేపట్టనున్నారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ జరగనుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.